విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను హెచ్చరించారు.

Update: 2024-11-23 12:05 GMT

దిశ, మామడ : వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను హెచ్చరిం చారు. శనివారం మండలంలోని న్యూ సాంగ్వి గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వంటగది, మరుగుదొడ్లు, స్నానపు గదులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

     ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేజీబీవీ ప్రత్యేక అధికారి, ఎంపీడీఓకు కలెక్టర్ షోకాజు నోటీసులు జారీ చేశారు. అలాగే స్వచ్ఛమైన తాగునీరును అందించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, ఎంపీడీఓ సుశీల్ రెడ్డి, కేజీబీవీ ప్రత్యేక అధికారి జ్యోతి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News