ఏకగ్రీవాలు రద్దు చేయండి.. హైకోర్టులో జనసేన పిటిషన్​

దిశ, ఏపీ బ్యూరో: గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్​ వేసినట్లు జనసేత నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరుతో వైసీపీ ఎన్ని వేధింపులకు దిగినా జనసేన వాటిని తట్టుకుని నిలబడినట్లు తెలిపారు. జనసేన గెలుపుతో రాష్ట్రంలో మార్పు మొదలైనట్లు మనోహర్ పేర్కొన్నారు. నిజాయతీగా ప్రజా సమస్యలపై పోరాడే జన సైనికులు విజయం సాధించినట్లు నాదెండ్ల […]

Update: 2021-02-22 09:52 GMT
Nadendla Manohar
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్​ వేసినట్లు జనసేత నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరుతో వైసీపీ ఎన్ని వేధింపులకు దిగినా జనసేన వాటిని తట్టుకుని నిలబడినట్లు తెలిపారు. జనసేన గెలుపుతో రాష్ట్రంలో మార్పు మొదలైనట్లు మనోహర్ పేర్కొన్నారు. నిజాయతీగా ప్రజా సమస్యలపై పోరాడే జన సైనికులు విజయం సాధించినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Tags:    

Similar News