నెలలు నిండక ముందే బాలిక ప్రసవం
దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరిట బాలికకు మాయ మాటలు చెప్పిన ఓ యువకుడు బాలికను గర్భవతిని చేశాడు. ఇదే క్రమంలో బాలిక నెలలు నిండకముందే ప్రసవించడంతో బాలికతో పాటు శిశవు కూడా మరణించింది. అయితే బాలికకు సొంత తల్లి వైద్యం చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన రెండ్రోజు క్రితం జరగ్గా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాలను పాతిపెట్టారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు మృత దేహాలను బయటకు వెలికి తీశారు. […]
దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరిట బాలికకు మాయ మాటలు చెప్పిన ఓ యువకుడు బాలికను గర్భవతిని చేశాడు. ఇదే క్రమంలో బాలిక నెలలు నిండకముందే ప్రసవించడంతో బాలికతో పాటు శిశవు కూడా మరణించింది. అయితే బాలికకు సొంత తల్లి వైద్యం చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటన రెండ్రోజు క్రితం జరగ్గా గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాలను పాతిపెట్టారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు మృత దేహాలను బయటకు వెలికి తీశారు. ప్రేమ పేరిట బాలికను మోసం చేసి, మృతికి కారణమైన యువకుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.