లాక్‌డౌన్ టైం.. యువకుడి ఫోన్ నేలకేసి కొట్టిన కలెక్టర్.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. కానీ.. కొందరు ఆకతాయిలు లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు. ఇలాంటి వారికి ఉన్నతాధికారులు, పోలీసులు బుద్ధి చెబుతున్నారు. తాజాగా లాక్‌డౌన్ సమయంలో బయట తిరుగుతున్న ఓ యువకుడిని పట్టుకుని అతడి చెంప చెల్లుమనిపించాడు ఓ కలెక్టర్. వివరాల ప్రకారం.. కరోనా కట్టడిలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో లాక్‌డౌన్ అమలవుతోంది. […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. కానీ.. కొందరు ఆకతాయిలు లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు. ఇలాంటి వారికి ఉన్నతాధికారులు, పోలీసులు బుద్ధి చెబుతున్నారు. తాజాగా లాక్‌డౌన్ సమయంలో బయట తిరుగుతున్న ఓ యువకుడిని పట్టుకుని అతడి చెంప చెల్లుమనిపించాడు ఓ కలెక్టర్.
వివరాల ప్రకారం.. కరోనా కట్టడిలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో పోలీసులతో కలిసి కలెక్టర్ రణబీర్ శర్మ లాక్‌డౌన్ నిబంధనల అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో అమన్ మిట్టల్ (23) అనే యువకుడు లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తూ బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా కలెక్టర్ శర్మ, అమన్ మిట్టల్ మధ్య ఏదో సంభాషణ చోటుచేసుకుంది.
ఈ క్రమంలో కోపంతో కలెక్టర్ యువకుడి ఫోన్‌ను నేలకేసి కొట్టి.. అతడి చెంప చెల్లుమనిపించాడు. అనంతరం అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వచ్చి ఆ యువకుడిని లాఠీలతో కొట్టారు. అంతేకాకుండా ఆ యువకుడిని కొట్టాలని కలెక్టర్ ఆదేశించడం విమర్శలకు దారితీసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకుడి విషయంలో కలెక్టర్ ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.