Breaking News : హైదరాబాద్‌లో చెరువులపై హైకోర్ట్ సంచలన నిర్ణయం
హైదరాబాద్(Hyderabad)లో చెరువులపై హైకోర్ట్(High Court) సంచలన నిర్ణయం ప్రకటించింది.
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లో చెరువులపై హైకోర్ట్(High Court) సంచలన నిర్ణయం ప్రకటించింది. ఇకపై హైదరాబాద్‌లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ మాదేనని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. హెచ్ఎండీఏ(HMDA) పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్(FTL), బఫర్‌జోన్‌లను నిర్ధారించేవరకు పూర్తి పర్యవేక్షణ మాదేనన్న హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 3,532 చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌ల నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గత జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 2,793 చెరువుల నోటిఫికేషన్లు జారీ చేయగా.. మరో 530 చెరువులకు నోటిఫికేషన్లు పూర్తి చేయాల్సి ఉంది. మరో 3 నెలల్లో నగరంలోని అన్ని చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లను నిర్ధారించాలని ప్రభుత్వానికి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.