తనుజా.. తాళి కట్టు.. వరుడి మెడలో మూడు ముళ్ళు వేసిన వధువు
దిశ, వెబ్‌డెస్క్: అదొక కల్యాణ మండపం.. వధూవరులిద్దరూ పెళ్లిపీటలపై కూర్చున్నారు.. మంత్రాలు చదువుతున్న పంతులుగారు తాళికట్టు అంటూ వధువు చేతికి మంళసూత్రాన్ని అందించారు.. ఆగండాగండీ.. వరుడు కదా తాళి కట్టాల్సింది.. వధువు చేతికి తాళి ఇచ్చారేంటి అనుకుంటున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. ఇక్కడ వధువే వరుడి మెడలో తాళి కట్టింది. అందరిముందు వధువు వంగి వరుడు మెడలో మూడుముళ్లు వేసింది. ఇదెక్కడి విడ్డురం రా బాబు.. వరుడు తాళికట్టించుకోవడమేంటి ..? అంటే దానికో పెద్ద కారణం […]
దిశ, వెబ్‌డెస్క్: అదొక కల్యాణ మండపం.. వధూవరులిద్దరూ పెళ్లిపీటలపై కూర్చున్నారు.. మంత్రాలు చదువుతున్న పంతులుగారు తాళికట్టు అంటూ వధువు చేతికి మంళసూత్రాన్ని అందించారు.. ఆగండాగండీ.. వరుడు కదా తాళి కట్టాల్సింది.. వధువు చేతికి తాళి ఇచ్చారేంటి అనుకుంటున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. ఇక్కడ వధువే వరుడి మెడలో తాళి కట్టింది. అందరిముందు వధువు వంగి వరుడు మెడలో మూడుముళ్లు వేసింది. ఇదెక్కడి విడ్డురం రా బాబు.. వరుడు తాళికట్టించుకోవడమేంటి ..? అంటే దానికో పెద్ద కారణం ఉందని వధూవరులిద్దరు తమ స్టోరీని చెప్పుకొచ్చారు.
ముంబైకి చెందిన శార్ధుల్ కదమ్ ఒక స్త్రీవాది (ఫెమినిస్ట్). అతనికి తనలాంటి భావాలే ఉన్న తనుజా పాటిల్ నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. ఇద్దరు సమానత్వభావాలు కలిగిఉండడంతో త్వరగానే ప్రేమలో పడిపోయారు. ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలనుకున్నారు. ఇరు వర్గాలు పెళ్ళికి ఒప్పుకున్నాయి. కానీ.. అప్పుడే శార్దూల్ ఓ కండిషన్ పెట్టాడు. పెళ్ళిలో తన భార్య చేత తానూ కూడా తాళి కట్టించుకొంటానని తెలిపాడు. ఈ విషయం విన్న స్నేహితులు, బంధువులు షాకయ్యారు. అదంతా జరగని పని అంటూ కొట్టిపడేశారు. అయినా శార్దుల్ తన పంతాన్ని వీడలేదు. ఈ విషయంలో ఎలాగోలా కుటుంబ సభ్యులను ఒప్పించాడు. ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంటూ పెళ్లి రోజు తనుజ మెడలో తాళి కట్టిన వెంటనే.. తన మెడలో కూడా ఆమెతో మంగళసూత్రం తొడిగించుకున్నాడు శార్దుల్. ఈ మంగళసూత్రాన్ని తానూ జీవితాంతం ధరిస్తానని ప్రమాణం కూడా చేశాడు. దీంతో ఈ పెళ్లి నెట్టింట వైరల్ గా మారింది.
ఇక పెళ్లిపై నెటిజన్లు వింత వింత కామెంట్లు చేస్తున్నారు. నీ పెళ్లి మా చావుకొచ్చింది.. నా భార్య కూడా నన్ను తాళి కట్టించుకోమంటుంది.. ఏం చేయమంటావ్న అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టగా.. తాళి విషయంలోనే సమానత్వం.. త్వరలో ప్రగ్నెంట్ కూడా అవ్వు అని కామెంట్లు పెడుతున్నారు. ఏదిఏమైనా ఆడ, మగ సమానత్వంతో ఈ వరుడు చేసిన పని కొంతమందికి కోపం తెప్పించినా.. మరికొంతమందిని ఆలోచింపజేస్తుంది.