వారికి గుడ్‌న్యూస్.. అకౌంట్లో రూ.24 వేలు జమ చేసిన ఏపీ ప్రభుత్వం

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులైన చేనేత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్మును జమ చేశారు. అర్హులైన ఒక్కో కుటుంబానికి రూ. 24 వేలు ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 80,032 మంది లబ్ధిదారులకు సీఎం జగన్ రూ.192.08 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈ […]

Update: 2021-08-10 02:25 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులైన చేనేత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్మును జమ చేశారు. అర్హులైన ఒక్కో కుటుంబానికి రూ. 24 వేలు ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 80,032 మంది లబ్ధిదారులకు సీఎం జగన్ రూ.192.08 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 80 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. వరుసగా మూడో ఏడాది నేతన్న నేస్తం ద్వారా సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.

“నా పాదయాత్రలో చేనేతల కష్టాలు చూశా. వారికి ఏదో చేయాలని పరితపించేవాడిని. వారిని కష్టాల నుంచి దూరం చేసేందుకు వైఎస్సార్ నేతన్న నేస్తం వంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్ధిక సాయం చేస్తున్నట్లు” తెలిపారు. “వరుసగా మూడో ఏడాది నేతన్న నేస్తం ద్వారా ఆర్ధిక సాయం చేస్తున్నాం. మూడో విడత కింద మంగళవారం రూ.192.08 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారం. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేతలకు ఆర్ధిక సాయం అందిస్తున్నాం” అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24వేల చొప్పున ప్రతీ ఏడాది సాయం చేస్తున్నామని..రాబోయే రోజుల్లో ప్రతీ చేనేత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

నగదు చెల్లింపులలో ఎలాంటి అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేస్తున్నట్లు వెల్లడించారు. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే ఆప్కో ద్వారా ఈ-మార్కెటింగ్‌ విధానం అమల్లోకి తీసుకువచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. మూడోవిడత కలుపుకుని ఇప్పటి వరకు రూ.576 కోట్లు చేనేత కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించింది. ఇప్పటి వరకు ఒక్కొక్కరికీ రూ.72వేల లబ్ధిపొందినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా కష్టకాలంలోనూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

Tags:    

Similar News