Depression: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీపై తీవ్ర ప్రభావం

బంగాఖాళాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా (Depression) రూపాంతరం చెంది.. వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

Update: 2024-11-25 09:32 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాఖాళాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా (Depression) రూపాంతరం చెంది.. వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న వాయుగుండం.. 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావం ఏపీపై తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరో మూడ్రోజులపాటు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 

Tags:    

Similar News