అమర్‌నాథ్ యాత్రే వాళ్ల టార్గెట్ : ఆర్మీ

దిశ, వెబ్ డెస్క్: హిందువుల పుణ్యతీర్థమైన అమర్నాథ్ ఆలయంపై తీవ్రవాదులు దృష్టి సారించినట్లు సైన్యం చెబుతోంది. అమర్నాథ్ యాత్రకోసం వెళ్లే యాత్రికులే లక్షంగా దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని స్పష్టంచేసింది. మరో 4 రోజుల్లో యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతీయ రహదారి-44పైనే తీవ్రవాదులు గురిపెట్టినట్లు సెక్టార్-2 కమాండర్, బ్రిగేడియర్ వీఎస్ ఠాకూర్ వెల్లడించారు. ఈ మార్గం నుంచే యాత్రికులు ఉత్తర ప్రాంతాలకు చేరుకుంటారని, అందువల్ల ఈ ప్రాంతం అత్యంత ప్రాధాన్యమైందన్నారు. ఈ […]

Update: 2020-07-17 11:57 GMT

దిశ, వెబ్ డెస్క్: హిందువుల పుణ్యతీర్థమైన అమర్నాథ్ ఆలయంపై తీవ్రవాదులు దృష్టి సారించినట్లు సైన్యం చెబుతోంది. అమర్నాథ్ యాత్రకోసం వెళ్లే యాత్రికులే లక్షంగా దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందిందని స్పష్టంచేసింది. మరో 4 రోజుల్లో యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతీయ రహదారి-44పైనే తీవ్రవాదులు గురిపెట్టినట్లు సెక్టార్-2 కమాండర్, బ్రిగేడియర్ వీఎస్ ఠాకూర్ వెల్లడించారు. ఈ మార్గం నుంచే యాత్రికులు ఉత్తర ప్రాంతాలకు చేరుకుంటారని, అందువల్ల ఈ ప్రాంతం అత్యంత ప్రాధాన్యమైందన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి-44 మొత్తం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని, అమర్నాథ్ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రక్షణ కల్పిస్తామని తెలిపారు.

Tags:    

Similar News