Israel Ceasefire: ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ

ఇజ్రాయెల్(Israel) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లెబనాన్‌(Lebanon)లోని హెజ్బొల్లా(Hezbollah)తో కాల్పుల విరమణ ఒప్పందాని(Ceasefire Deal)కి అంగీకరించింది. హెజ్బొల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ మంగళవారం ప్రకటించింది.

Update: 2024-11-26 19:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్(Israel) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లెబనాన్‌(Lebanon)లోని హెజ్బొల్లా(Hezbollah)తో కాల్పుల విరమణ ఒప్పందాని(Ceasefire Deal)కి అంగీకరించింది. హెజ్బొల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ మంగళవారం ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో 13 నెలల దాడులకు ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్‌లో ఓటింగ్ తర్వాత మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. హమాస్‌ను ఏకాకి చేసి బంధీలను విడుదల చేయించుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. హెజ్బొల్లా ప్రధాన నాయకులు మరణించడంతో ఆ సంస్థ కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిందని, మూడు నెలల క్రితం ఇది అసాధ్యంగా కనిపించేదని వివరించారు. ఈ కాల్పుల విరణమపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు ప్రత్యేక ప్రకటనలు విడుదల చేసే అవకాశముంది. హమాస్‌కు మద్దతుగా యుద్ధంలోకి హెజ్బొల్లా దిగడంతో ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య సుమారు ఏడాది కాలంగా దాడులు జరుగుతున్నాయి.

Tags:    

Similar News