కేటీఆర్‌దే ‘కీ’ రోల్.. నచ్చిన వారికే కీలక పదవులు.!

దిశ, తెలంగాణ బ్యూరో : అధికార టీఆర్ఎస్ పార్టీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తోంది. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీ నియామకాలకు కసరత్తు చేస్తోంది. కమిటీలో ఉన్నవారు ఉంటారో, లేకుంటే కొత్తవారికి అవకాశం ఇస్తారో తెలియని పరిస్థితి. దీంతో నామినేటెడ్ పోస్టు దక్కక పోయినా కేవలం పార్టీలో చోటన్న దక్కించుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏ కార్యక్రమంలో పాల్గొన్న ఆ కార్యక్రమంలో ప్రత్యక్ష మవుతున్నారు ఆశావాహులు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి […]

Update: 2021-09-19 22:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అధికార టీఆర్ఎస్ పార్టీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తోంది. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీ నియామకాలకు కసరత్తు చేస్తోంది. కమిటీలో ఉన్నవారు ఉంటారో, లేకుంటే కొత్తవారికి అవకాశం ఇస్తారో తెలియని పరిస్థితి. దీంతో నామినేటెడ్ పోస్టు దక్కక పోయినా కేవలం పార్టీలో చోటన్న దక్కించుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏ కార్యక్రమంలో పాల్గొన్న ఆ కార్యక్రమంలో ప్రత్యక్ష మవుతున్నారు ఆశావాహులు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తుంది. అయినప్పటికీ రాష్ట్రంలోని నామినేటెడ్ పదవులను పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. జిల్లా స్థాయిలోని నామినేటెడ్‌తో పాటు రాష్ట్రస్థాయిలోని కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు, వివిధ పార్టీల నుంచి పదవులు ఆశించిన టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో పదవులు రాక కొంత నిరాశనిస్పృహలకు గురవుతున్నారు. అయితే వాటిని భర్తీ చేస్తామని, పార్టీ కోసం పనిచేసే నేతలకు తగిన గుర్తింపు నిస్తామని అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో బీసీ కార్పొరేషన్‌తో పాటు ఆర్టీసీ చైర్మన్ నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. దీంతో పదవులను ఆశించిన నేతల్లో ఆశలు చిగురించాయి. తమకు సన్నిహితంగా ఉన్న నేతలతో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత కీలక రోల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌దే. దీంతో ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. అధికారిక, అనాధికార కార్యక్రమం ఏదైనా సరే ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మేము సైతం వచ్చామంటూ కేటీఆర్‌కు నమస్కరిస్తున్నారు. ఆయన వెన్నంటే ఉంటున్నారు. తమతమ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, చేపడుతున్న కార్యక్రమాలతో పాటు తాము చేస్తున్న పనులను వివరిస్తున్నారు. అంతేకాదు నామినేటెడ్ పదవిగానీ పార్టీ పదవి గానీ నోరుతెరిచి చెప్పకుండా తమకు అనుకూలంగా ఉండేవారు… కేటీఆర్ సన్నిహితులతో చెప్పిస్తున్నట్లు సమాచారం. అయితే పదవులు దక్కించుకుంటారా? లేకుంటే ఆశించి భంగపడతారో వేచిచూడాల్సిందే. ఇది ఇలా ఉంటే జిల్లా స్థాయిలో పార్టీ కమిటీల నియామకం జరుగుతుంటే వాటిలో పాల్గొనకుండా కేవలం పదవుల కోసం ప్రదక్షిణలు చేస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News