TRSకు తలనొప్పిగా మాజీ మేయర్ రవీందర్ సింగ్.. మంత్రి గంగుల ఎమర్జెన్సీ మీటింగ్

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్‌ను పోటీ నుండి తప్పించేందుకు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. బుధవారం రాత్రి నుండి అదృశ్యమైన రవీందర్ సింగ్‌ను కాంటాక్ట్ చేసిన అధిష్టానం పెద్దలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవి ఇచ్చేందుకు కూడా అధిష్టానం ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు రవీందర్ సింగ్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అనంతరం బుధవారం సాయంత్రం నుండి […]

Update: 2021-11-24 23:13 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్‌ను పోటీ నుండి తప్పించేందుకు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. బుధవారం రాత్రి నుండి అదృశ్యమైన రవీందర్ సింగ్‌ను కాంటాక్ట్ చేసిన అధిష్టానం పెద్దలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవి ఇచ్చేందుకు కూడా అధిష్టానం ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు రవీందర్ సింగ్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అనంతరం బుధవారం సాయంత్రం నుండి ఎవరికీ చిక్కకుండా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిన రవీందర్ సింగ్ ఇంతవరకు ఎవరి కాంటాక్ట్‌లోకి కూడా వెళ్లలేదని, అతనితో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు ఎవరూ మాట్లాడలేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. బుధవారం సాయంత్రం నుండే ఫోన్ స్విఛ్చాఫ్ చేసిన ఆయన ఎలా మాట్లాడుతారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

క్యాంప్‌లో ఎమర్జెన్సీ మీటింగ్..

గురువారం టీఆర్ఎస్ క్యాంప్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కరీంనగర్‌కు చెందిన 38 మంది కార్పొరేటర్లు, మంత్రి గంగుల సమక్షంలో 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో రవీందర్ సింగ్ వ్యవహారం గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. రవీందర్ సింగ్ డిమాండ్లకు తలొగ్గితే తామంతా పార్టీకి దూరంగా ఉంటామని తేల్చి చెప్పాలని భావిస్తున్నారు. రవీందర్ సింగ్‌కు ప్రాధాన్యత కల్పిస్తే తాము ఇప్పటికిప్పుడు క్యాంప్ నుండి కూడా వెళ్లిపోతామని స్పష్టం చేయనున్నట్టు సమాచారం.

 

Tags:    

Similar News