పురుషులు-మహిళలు.. ఎవరిలో ఎక్కువగా చలి ఫీలింగ్ ఉంటుంది.. ఎందుకు?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగుతోంది. జ

Update: 2025-01-04 15:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగుతోంది. జనాలు చలితో వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి పూట బయటకు వెళ్దామంటే చలికి భయపడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తూనే ఉంటారు. అయితే చలికాలంలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలకే ఎక్కువగా పెడుతుందని అంటుంటారు. మరీ దీనికి కారణమేంటి? అని శరీరానికి సంబంధించిన శాస్త్రం ఏం చెబుతోంది? ఇప్పుడు తెలుసుకుందాం..

మగవారికంటే మహిళల బాడీలో తక్కువ కండరాలు ఉంటాయి. కాగా రక్త నాళాల నుంచి స్కిన్ మధ్య డిస్టెన్స్ కారణగా ఆడవాళ్లకు ఎక్కువగా చలిగా అనిపిస్తుంది. అంతేకాకుండా మాంసకణాల శాతం కూడా తక్కువగా ఉంటుంది. చర్మం, కండరాల మధ్య స్త్రీ పురుషుల్లో కొవ్వు పరిమాణం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మహిళలకు జీవక్రియ రేటు తక్కువగా ఉండటం వల్ల తక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. అలాగే చలికి మహిళలకు జలుబు వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

సాధారణ రక్తపోటు తక్కువగా ఉండడం వల్ల కూడా క్రమంగా బాడీలో వేడి తగ్గిపోతుంది. కాగా మహిళలు చలి నుంచి తప్పించుకోవాలంటే వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వ్యాయామం స్ట్రెస్ ను ఆందోళన ను తగ్గించడమే కాకుండా బాడీలో వేడి ఉత్పత్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.   

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read More...

Winter: చలికాలంలో కుక్కలతో జాగ్రత్త.. లేదంటే ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉందంటున్న నిపుణులు


Tags:    

Similar News