TPCC: దోపిడిదారుల హక్కుల చైర్మన్ కేటీఆర్.. అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్
కేటీఆర్ తప్పు చేసి దాబాయించే స్టేట్మెంట్ ఇవ్వడం సిగ్గు చేటు అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(TPCC General Secretery Addanki Dayakar) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్ తప్పు చేసి దాబాయించే స్టేట్మెంట్ ఇవ్వడం సిగ్గు చేటు అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(TPCC General Secretery Addanki Dayakar) అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ మాటలే దోపిడి దారులకు అండగా ఉన్నట్లు ఉన్నాయని విమర్శించారు. మీరు ఏదైనా చేసుకోండి నేను ప్రజల కోసం కొట్టాడుతా అని మాట్లాడుతున్నాడని, ఆయనను దోపిడిదారుల హక్కుల చైర్మన్ గా చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఏసీబీ(ACB), ఈడీ(ED) ప్రజల కోసం కొట్లాడే వారి హక్కులను కాపాడేందుకు నోటీసులు ఇస్తుందా అని ప్రశ్నించారు.
అలాగే దొంగతనం చేసి దాబాయిస్తే ప్రజలు నమ్ముతారు అనే భ్రమల నుంచి కేటీఆర్ బయటికి రావాలని, ఆయన ముద్దాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. మీ ప్రభుత్వంలో మమ్ముల్ని లాయర్లకు అనుమతి ఇచ్చారా? అని నిలదీశారు. కేటీఆర్ తీరు దొంగల హక్కుల కోసం కొట్లాడే నాయకుడిలా ఉందని, మీ కుటుంబమంతా ఏదో ఒక దోపిడి చేసి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దబాయిస్తారని ఆరోపించారు. దోచుకొని తిని ప్రభుత్వాన్ని మభ్యపెట్టలేరని, ప్రజల సొమ్ము తిన్నవాళ్లు అరెస్ట్ కావాల్సిందే.. జైలు కూడు తినాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజలు పాలించమని అధికారం ఇస్తే.. ప్రజల సొమ్మునే దోచుకొని ప్రభుత్వాన్ని, అధికారులని దబాయిస్తున్నారని అన్నారు. మీ కొట్లాడేది మీ కుటుంబసభ్యులే తప్ప మిమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని గ్రహించాలని అద్దంకి వ్యాఖ్యానించారు.