దిశ పత్రిక మీడియా రంగానికే మార్గదర్శకం

మీడియా రంగానికి దిశ పత్రిక మార్గదర్శకం లాంటిదని నార్కట్ పల్లి సిఐ కె.నాగరాజు అన్నారు.

Update: 2025-01-06 16:30 GMT

దిశ, చిట్యాల: మీడియా రంగానికి దిశ పత్రిక మార్గదర్శకం లాంటిదని నార్కట్ పల్లి సిఐ కె.నాగరాజు అన్నారు. సోమవారం చిట్యాల పట్టణ కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో దిశ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రింట్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు అందించే లక్ష్యంతో విప్లవాత్మకమైన మార్పుల దిశగా దిశ పత్రిక పయనం అద్భుతమని, ప్రస్తుత మీడియా రంగానికే దిశ మీడియా దిక్సూచి లాంటిదని అన్నారు. ఎప్పటి వార్తలు అప్పుడే పాఠకులకు పత్రికముఖంగా అందజేస్తూ..విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందన్నారు. వార్త సేకరణలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు బేషాజాలకు, బెదిరింపులకు భయపడకుండా తాను నమ్మిన సిద్ధాంతం ప్రకారం అవినీతి అక్రమాలకు సంబంధించిన వార్తలను పాఠకులకు చేరవేస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడంలో..దిశ పత్రిక ముందుందన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికారుల, ప్రజా ప్రతినిధుల బాధ్యతలను గుర్తు చేస్తూ దిశ మీడియా చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల ఎస్ఐ ఎన్ ధర్మ, సమాచార హక్కు చట్టం నాయకులు బొడ్డు బాబురావు, గాదే ఎల్లేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News