బీసీలు అన్ని రంగాల్లో ఎదగాలి
బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందాలని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందాలని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మంగళవారం యాదగిరిగుట్టలో "మన ఆలోచన" సమాలోచన శిక్షణ శిబిరంను కార్యనిర్వాహకులు కటకం నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ చిరంజీవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ప్రొఫెసర్ శ్రీనివాసులు, వీజీఆర్ నారగోని, కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కొంగ వీరస్వామి, పాత్రికేయులు విద్యా వెంకట్, పిడికిలి నారాయణ, వెంకటరాజు, చింత స్వామి, ఒంటెద్దు నారాయణ, వెంకటస్వామి, పూస నరసింహ, భత్తుల సిద్ధేశ్వర్, గుండ్ల ఆంజనేయులు, పంతులు మధుబాబు, కొమురయ్య, వేమునూరు మురళీధర్ చారీ, సింగజ్యోతి శ్రీనివాస్, చాపర్తి కుమార్ లు పాల్గొని మాట్లాడారు. విద్యావంతులైన బీసీలు, సమాజాన్ని పరివర్తన వైపు నడిపించే బీసీలు, రాజకీయంగా ఒకటి కావాలని పిలుపునిచ్చారు. బీసీలు చరిత్ర తెలుసుకొని, దానిపై అవగాహన పెంచుకొవాలన్నారు. నేటికీ హిందూ ధర్మ శాస్త్రాన్ని తమ కులవృత్తులతో చైతన్యం చేసుకుంటూ, లోపాలను తొలగించుకుంటూ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. మన ఓటు విలువ తెలుసుకుంటూ మనకు మనమే ఓటు వేసుకోవాలన్నారు. తెలంగాణలో మరో ఉద్యమం జరగాలని, ఆ ఉద్యమం బీసీ ఉద్యమమే కావాలని, తెలంగాణలో సమర శంఖం పూరించడానికి ఇలాంటి శిక్షణ శిబిరాలు దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో దశరథ్ సాగర్, శిలివేరు శంకర్, బచ్చనబోయిన శ్రీనివాస్, పోలగోని శ్రీనివాస్, పెండ్యం లక్ష్మణ్, శ్రీనివాస్, శ్యామల యాదగిరి, బాలరాజులు పాల్గొన్నారు.