అందరూ మెచ్చిన పత్రిక దిశ
2025 దిశ దినపత్రికని ప్రముఖ పారిశ్రామికవేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దూదిపాల శ్రీధర్ రెడ్డి దిశ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించారు.
దిశ, కొండమల్లేపల్లి : 2025 దిశ దినపత్రికని ప్రముఖ పారిశ్రామికవేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దూదిపాల శ్రీధర్ రెడ్డి దిశ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో భాగంగా సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..అతి తక్కువ సమయంలోనే ఎంతో ప్రజాదరణ పొంది నికార్సైన వార్తలు రాస్తూ.. కొన్ని పెద్ద పేపర్లకు గీటుగా దిశ ఏం తక్కువ కాదని చాటి చెబుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత విలువైన దినపత్రికగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్న పత్రిక ఏదైనా ఉందంటే అది దిశనే అని అన్నారు. ఎప్పటి వార్తలు అప్పుడే ప్రజలకు అందుబాటులో ఉంచుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియపరుస్తూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తుందని ఆయన అన్నారు. దిశ మీడియా నికార్సైన అయిన వార్తలు రాస్తూ అతి తక్కువ సమయంలోనే ప్రజల్లో మంచి ఆదరణ తెచ్చుకొని దినదిన పై స్థాయికి పెద్ద స్థాయికి వచ్చిందని అని అన్నారు. దిశ విలేకరులు ఇలాగే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలకి అధికారులకి ప్రజా సమస్యలు తెలియజేయాలని , నిజాన్ని ప్రజలకు చూపించాలని సూచించారు.ఈ సమావేశంలో, కొండమల్లేపల్లి దిశ రిపోర్టర్ దండు రవికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు వేమన్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏరుకొండ రాము, గంధం సురేష్ రాజారావు,జితేందర్ యాదవ్, ఏకుల సురేష్ దితరులు పాల్గొన్నారు.