ప్రియాంకా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు..

కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ పై మాజీ ఎంపీ రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలు సరికావని ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ మండిపడ్డారు.

Update: 2025-01-08 14:57 GMT

దిశ,నకిరేకల్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ పై మాజీ ఎంపీ రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలు సరికావని ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ మండిపడ్డారు. వెంటనే మాజీ ఎంపీని బీజేపి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో సంఘం నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ..నాటి మణిపూర్ ఘటన నుండి నేటి ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యల వరకు బీజేపీ ప్రభుత్వ వైఖరి మహిళా లోకం పట్ల ఎంత చిద్దశుద్ది తో ఉందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దీనికి తగిన మూల్యం బీజేపీ ప్రభుత్వం ఎదురుకుంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ నాయకులు జహంగీర్,జిల్లా యువ నాయకులు ఉగ్గిడి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు గణేష్,సింహాద్రి,సంజయ్, జాని,అజయ్,తరుణ్,గోపి,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.