అతి తక్కువ సమయంలో అతిపెద్ద దినపత్రిక గా ఎదిగిన దిశ

దిశ దినపత్రికని స్థానిక సీఐ ధనంజయ్య ,స్థానిక ఎస్సై ముత్యాల రామ్మూర్తి దిశ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.

Update: 2025-01-07 15:32 GMT

దిశ ,కొండమల్లేపల్లి : దిశ దినపత్రికని స్థానిక సీఐ ధనంజయ్య ,స్థానిక ఎస్సై ముత్యాల రామ్మూర్తి దిశ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ ఆవిష్కరణలో భాగంగా సిఐ ధనంజయ్య మాట్లాడుతూ..అతి తక్కువ సమయంలోనే ఎంతో ప్రజాదరణ పొంది నికార్సైన వార్తలు రాస్తూ..కొన్ని పెద్ద పేపర్లకు గీటుగా దిశ ఏం తక్కువ కాదని చాటి చెబుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత విలువైన దినపత్రికగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుందన్నారు. ఎప్పటి వార్తలు అప్పుడే ప్రజలకు అందుబాటులో ఉంచుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ..ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియపరుస్తూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎస్సై రామ్మూర్తి మాట్లాడుతూ..దిశ మీడియా నికార్సైన అయిన వార్తలు రాస్తూ అతి తక్కువ సమయంలోనే ప్రజల్లో మంచి ఆదరణ తెచ్చుకొని దినదిన పై స్థాయికి పెద్ద స్థాయికి వచ్చిందని అని అన్నారు. దిశ విలేకరులు ఇలాగే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలకి అధికారులకి ప్రజా సమస్యలు తెలియజేయాలని న్యాయ ,అన్యాయాలు కాకుండా ఉన్న నిజాన్ని ప్రజలకు చూపించాలని అన్నారు.ఈ సమావేశంలో కొండమల్లేపల్లి దిశ రిపోర్టర్ దండు రవికుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News