మీడియా రంగంలో దిశ పత్రికకు ప్రత్యేక స్థానం

మీడియా రంగంలో దిశ పత్రికకు ప్రత్యేక స్థానం ఉందని, తక్కువ కాలంలోనే గొప్ప ప్రజా ఆదరణ పొందగలిగిందని రామన్నపేట తహసిల్దార్ సీ.లాల్ బహుదూర్ అన్నారు.

Update: 2025-01-08 13:55 GMT

దిశ,రామన్నపేట : మీడియా రంగంలో దిశ పత్రికకు ప్రత్యేక స్థానం ఉందని, తక్కువ కాలంలోనే గొప్ప ప్రజా ఆదరణ పొందగలిగిందని రామన్నపేట తహసిల్దార్ సీ.లాల్ బహుదూర్ అన్నారు. మంగళవారం రామన్నపేట తహసిల్దార్ కార్యాలయంలో దిశ పత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మీడియా రంగంలో ఇప్పటికే దిశ పత్రిక ప్రత్యేక స్థానం పొందిందని, ప్రజా సమస్యల వెలికి తీసి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పత్రికలు పనిచేయాలని తెలిపారు. వాస్తవా కథనాలను బయటికి తీయాలని, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా దిశ యజమాన్యానికి, పాఠకులకు, జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట దిశ రిపోర్టర్ శివరాత్రి రమేష్, రెవిన్యూ సిబ్బంది గాలయ్య, వినీత, స్రవంతి, శైలజ, శ్రీధర్, వంశీకృష్ణ, సువర్ణ, కవిత, ఆఫీజ్, ఉమామహేశ్వర, శివరాత్రి రఘుపతి తదితరులు పాల్గొన్నారు.


Similar News