దిశ పత్రిక 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

పత్రిక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన దిశ 2025 క్యాలెండర్ ను బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గోపాల్ రావు ఆవిష్కరించారు.

Update: 2025-01-08 12:24 GMT

దిశ, నిడమనూరు : పత్రిక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన దిశ 2025 క్యాలెండర్ ను బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గోపాల్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అనతి కాలం లో దిశ పత్రిక అందరికి అందుబాటులోకి వచ్చి పాఠకుల మన్ననలను పొందిందని, ఎప్పటికప్పుడు వార్తలను సేకరించి ప్రత్యేక ఎడిషన్లు, క్లిప్పింగ్స్ ఆన్లైన్ ద్వారా పంపుతూ ప్రజలకు,అధికారులకు దగ్గరైదని కొనియాడారు. ఈ కార్యక్రమం లో దిశ నిడమనూరు విలేఖరి రామడుగు రామమూర్తి ,దిశ మిర్యాలగూడ విలేకరి సైదులు, ఏ, ఎస్, ఐ జోజి, అప్పారావు,లలితమ్మ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News