భర్తను హతమార్చేందుకు భార్య పన్నాగం

అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య ప్రియుడితో కలిసి పన్నాగం పన్నిన సంఘటన నియోజకవర్గంలో మంగళవారం కలకలం సృష్టించింది.

Update: 2025-01-08 11:17 GMT

దిశ,కోదాడ : అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య ప్రియుడితో కలిసి పన్నాగం పన్నిన సంఘటన నియోజకవర్గంలో మంగళవారం కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తొగర్రాయి గ్రామానికి చెందిన బాలేబోయిన ముత్తయ్య (వెంకయ్య) భార్య ధనలక్ష్మి ఆటోలో గ్రామ గ్రామాన తిరుగుతూ పండ్లమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ముత్తయ్య కి ఆరోగ్యం బాగోలేకపోవడంతో గుడిబండ గ్రామానికి చెందిన కొండ గోపి అనే వ్యక్తి తో ధనలక్ష్మి పరిచయం పెంచుకొని ఆటో డ్రైవర్ గా గోపితో పండ్లు అమ్మేవారు. వారిద్దరికీ అక్రమ సంబంధం ఉండడంతో గమనించిన భర్త ధనలక్ష్మిని మందలించడంతో అడ్డుగా ఉన్న భర్త ముత్తయ్యను హతమార్చాలని ధనలక్ష్మి గోపీలు పన్నాగం పన్ని తొగర్రాయి గ్రామానికి చెందిన వీరబాబు జగ్గయ్యపేటకు చెందిన నాగరాజు ఇద్దరు వ్యక్తుల కి 50వేల రూపాయలు సుపారి ఇచ్చి హతమార్చాలి అని చెప్పారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఒంటరిగా ఉన్న ముత్తయ్య ఇంటికి వెళ్లి కండువాను మెడకు చుట్టి హత్య చేయాలని ప్రయత్నించగా ముత్తయ్య కేకలు వేయడంతో ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల గ్రామస్తులు రావడంతో.. ఆ ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. దీంతో ముత్తయ్య రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా..అత్యాయత్నానికి ప్రయత్నించిన ఇద్దరిని, ధనలక్ష్మి, గోపిని నలుగురిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పట్ట పగలే గ్రామంలో హత్యాయత్నానికి పాల్పడిన విషయం నియోజకవర్గ వ్యాప్తంగా సంచలనంగా మారింది.


Similar News