తప్పులకు తావివ్వకుండా వివరాలు నమోదు చేయాలి : వీపీ.గౌతమ్
తప్పులకు తావివ్వకుండా ఇందిరమ్మ ఇండ్ల వివరాలు
దిశ, వరంగల్ టౌన్ : తప్పులకు తావివ్వకుండా ఇందిరమ్మ ఇండ్ల వివరాలు నమోదు చేయాలని రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు. బల్దియా పరిధిలోని 29వ డివిజన్ రామన్నపేటలో సోమవారం జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేసి సర్వే నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ సర్వే నిర్వహించు క్రమంలో లబ్ధిదారులు అందించే ధ్రువ పత్రాలలో ఉన్న సమాచారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా సర్వేయర్ లు నమోదు చేసేలా చూడాలని ఇంటి ఓనర్ లబ్ధిదారు ఐతే సర్వేయర్ లు ఆప్ లో ఏ విధంగా నమోదు చేస్తున్నారు, అద్దె ఇళ్లలో ఉండి ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు నమోదు తీరును ఎండి పరిశీలించి నమోదు విధానాన్ని వారిని అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం హనుమకొండ ఐడిఓసి లోని మినీ సమావేశ మందిరంలో సర్వే పురోగతి పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎండి పాల్గొని ఇప్పటి వరకు బల్దియా పరిధిలో పూర్తయిన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ లు మాట్లాడుతూ ఇప్పటివరకు 90 శాతం సర్వే పూర్తి చేసినట్లు తెలుపగా మిగతా సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు. కొన్ని దరఖాస్తులలో వార్డు నంబర్ లు తప్పుగా నమోదు అయినట్లు గుర్తించడం జరిగిందని వాటిని సవరించడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరగా త్వరలో ఆప్షన్ ఇవ్వనున్నట్లు ఎండి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ సిఈ చైతన్య కుమార్, డిప్యూటీ కమిషనర్లు కృష్ణారెడ్డి, రవీందర్, ఆర్ ఐ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.