పట్టపగలే ఇంట్లో చోరీ…

మండల కేంద్రంలో సోమవారం పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం చెందిన ఏరానాగి రవి, ఎరనాగి సీతారాములు తెలిపిన వివరాల ప్రకారం…

Update: 2025-01-07 15:20 GMT

దిశ,నర్సింహులపేట: మండల కేంద్రంలో సోమవారం పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం చెందిన ఏరానాగి రవి, ఎరనాగి సీతారాములు తెలిపిన వివరాల ప్రకారం… ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బంగారం,వెండి నగలతో పాటు నగదు అపహరించినట్లు తెలిపారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన స్థలానికి మరిపెడ సీఐ రాజకుమార్,సీసీఎస్ సీఐ ఖాసిం, ఎస్సై మాలోత్ సురేష్ చేరుకుని విచారణ చేపట్టారు.


Similar News