డిజిటల్ రంగంలో 'దిశ' సంచలనమే..

దిశ అంటేనే పత్రిక రంగంలో డిజిటల్ మీడియాతో సరికొత్త ఒరవడికి నాంది పలికి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని దుగ్గొండి తహసీల్దార్ రవి చంద్రా రెడ్డి, ఎంపీడీఓ అరుంధతి, ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు.

Update: 2025-01-08 10:35 GMT

దిశ, దుగ్గొండి : దిశ అంటేనే పత్రిక రంగంలో డిజిటల్ మీడియాతో సరికొత్త ఒరవడికి నాంది పలికి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని దుగ్గొండి తహసీల్దార్ రవి చంద్రా రెడ్డి, ఎంపీడీఓ అరుంధతి, ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండల కార్యాలయాల్లో దిశ దినపత్రిక నూతన సంవత్సర 2025 క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధికారులు మాట్లాడుతూ ఇటు డిజిటల్ మీడియా అటు ప్రింట్ మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దిశ శ్రీకారం చుట్టిందని అన్నారు.

పత్రికా రంగానికి, డిజిటల్ ద్వారా డైనమిక్ ఎడిషన్ కు పరిచయం చేసి, వాస్తవాలను వార్తలుగా ఎప్పటికి అప్పుడు పాఠకులకు అందించే ఘనత దిశకే దక్కుతుందని ప్రశంసించారు. పత్రికా రంగంలో డిజిటల్, ప్రింటింగ్, స్పెషల్ ఎడిషన్ ద్వారా సమాచారాన్ని ప్రజలకు సులభంగా చేరవేస్తున్న దిశ పత్రిక సంచలనమని అన్నారు. మన చుట్టూ జరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దిశ రిపోర్టర్ ప్రతాప్, డిప్యూటీ తహశీల్దార్ ఉమారాణి, ఎంపీవో శ్రీధర్ గౌడ్, సూపరిండెంట్ రవి కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు రాంబాబు, మల్లయ్య, తహశీల్దార్ కార్యాలయ ఉద్యోగులు రాజ్ కుమార్, మురళి, రంజిత్, కానిస్టేబుల్ లు సరిత, శిరీష, తదితరులు పాల్గొన్నారు.


Similar News