విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం..
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టే వాడ గ్రామంలో చోటు చేసుకుంది.
దిశ, గూడూరు : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టే వాడ గ్రామంలో చోటు చేసుకుంది. మట్టెవాడ గ్రామానికి చెందిన బిజ్జ సత్యనారాయణ కుటుంబం రోజు కూలిపని చేసుకొని కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉంటారు. రోజు లాగానే బుధవారం కూలి పనులకు వెళ్లగా మధ్యాహ్నం సమయంలో ఇంట్లో అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తో పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు వారు తెలిపారు. ఇంట్లో ఉన్న సామాగ్రితో పాటు నిత్యావసర వస్తువులు కూడా కాలి బూడిదవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకున్నారు.