రోజురోజుకూ పెరుగుతున్న కొత్త వాహనాలు..ఇంటికో బండి.. కారు..

రాష్ట్రంలో రోజురోజుకూ వేల సంఖ్యలో జనాభా పెరుగుతున్న ఈ

Update: 2025-01-09 02:01 GMT

దిశ, హనుమకొండ : రాష్ట్రంలో రోజురోజుకూ వేల సంఖ్యలో జనాభా పెరుగుతున్న ఈ కాలంలో కనీసం ఇంటికో టూ వీలర్ బండి, లేదా ఒక కారు తప్పకుండా ఉంటున్నాయి. హనుమకొండ జిల్లాలో కూడా ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి ఒక టూ వీలర్, ఒక కారు తప్పకుండా ఉంటుంది. ఇలా వేల సంఖ్యలో వాహనాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. జిల్లాలో మాత్రం వేల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి. అందుకు సాక్ష్యం రవాణా శాఖలో రోజూ వారీగా అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అవుతుండడమే. వాహనాలు తీసుకునే ముందు డ్రైవింగ్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన వారికే రవాణా శాఖ అధికారులు వెహికిల్స్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అంతకు ముందు వాహనం తీసుకున్న సంబంధిత వాహనదారులు తీసుకున్న వాహనాన్ని బట్టి సంబంధిత డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో చూసి కన్‌ఫామ్ అయ్యాక రిజిస్ట్రేషన్ చేశారు. ఒకవేళ లేకుంటే తక్షణమే తీసుకోవాలని రవాణాశాఖ అధికారులు వాహనదారులకు తెలియజేస్తారు.

రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలు..

జిల్లాలో రోజురోజుకు వాహనాలు పెరుగుతుండడంతో గాలి కాలుష్యం పెరుగుతుంది. పదిహేను సంవత్సరాలు నిండిన బండ్లను సీజ్ చేస్తూ, డ్రైవింగ్ చేయ్యకూడదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అయినా కూడా ఈ రోజుల్లో అలాంటి వాహనాలు ఉన్నపటికీ కొత్త వాహనాల జోరు పెరుగుతోంది. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి కలిపి పది వాహనాలు ఉంటున్నాయి. ఈ రోజుల్లో ఒక్కొకరికి ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు (కార్లు) తప్పకుండా ఉంటున్నాయి. అంతే కాకుండా వాళ్లు ఉంటున్న లోకల్‌గా కూడా తిరగాడానికి సపరేటుగా ఓ స్కూటీ లేదా ఇతర వాహనాలు తీసుకుంటున్నారు. ఇలా రోజురోజుకు జిల్లాలో వాహనాలు జోరుగా పెరుగుతున్నాయి. అధికంగా టూ వీలర్ బండ్లు పెరుగుతూ వస్తున్నాయి. పేదవాడి ఇంట్లో అందరికీ కలిపి ఒక టూ వీలర్ బండి ఉంటే, అదే కాస్తా డబ్బు ఉన్న వ్యక్తి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి టూ వీలర్ బండ్లు, అలాగే సపరేటుగా అన్ని కార్లు ఉంటున్నాయి. ఇలా వందల సంఖ్యల్లో వాహనాలు పెరుగుతున్నాయి.

అధిక సంఖ్యలో టూ వీలర్స్..

ఏడాది కాలంలో జిల్లాలో అధికంగా టూ వీలర్ వాహనాలు పెరిగాయి. అందుకు భిన్నంగా ఇంటికి నాలుగు ద్విచక్ర వాహనాలు పెరుగుతున్నాయి. ఇలా 2023 – 2024 సంవత్సరంలో మోటార్ సైకిల్స్ మొత్తం 11,815 వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. అంటే నెలకు దాదాపు 900 వాహనాల పై చిలుకు రిజిస్టర్ అవుతున్నాయి. కానీ సంవత్సర కాలంలో అతి తక్కువ రిజిస్టరైన వాహనాలు ఏమిటంటే రింగ్ మౌంటెడ్ (బోర్ వెల్స్) కొత్త వాహనాలు కేవలం సంవత్సర కాలంలో రెండు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఇలా అధిక సంఖ్యలో వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. 2023 – 2024 సంవత్సర కాలంలో రిజిస్టర్డ్స్ ఇలా.. అడాప్టెడ్ వెహికల్స్ (మార్పిడి చేయబడిన వాహనాలు)–8, అంబులెన్సులు–8, ఆర్టికల్ టెక్ వెహికల్స్ –15, ఆటో రిక్షా వెహికల్స్– 649, ప్రైవేటు యూజ్ క్రైన్స్–3, గూడ్స్ క్యారేజ్ –343, లోడర్ –10, మాక్సి క్యాబ్ –15, మోటార్ క్యాబ్–192, మోటార్ కార్ –3,265, మోటార్ సైకిల్ 11,815, మోటార్ గ్రాడర్ –3, ఓమ్నీ బస్ –9, ప్రైవేట్ ఓమ్నీ బస్ –22, రింగ్ మౌంటెడ్ (బోర్ వెల్స్) –2, రోడ్డు రోలర్ –5, సెల్ఫ్ ప్రొపెల్డ్ హార్వెస్టర్స్ –4, స్టేజ్ కొరియా జేస్ –81, త్రీ వీల్డ్ గూడ్స్ –129, ట్రాక్టర్ డ్రివెన్ కంబైన్డ్ హార్వెస్టర్ –28, అగ్రికల్చర్ ట్రాక్టర్స్ –452, కమర్షియల్ ట్రాక్టర్లు –178, అగ్రికల్చర్ ట్రైలర్ –158, కమర్షియల్ ట్రైలర్ –114, వెహికల్ ఫిట్టెడ్ విత్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ –15 వెహికల్స్ మొత్తం 17,523 వాహనాలు ఏడాది కాలంలో రిజిస్టర్ అయ్యాయి. వాహనాల పర్మిట్, వాహనాల ఫిట్నెస్, ఇలా పలు రకాల వాటిపై కేసెస్ బుక్ చేశారు. ఇలా ఈ 2023 – 2024 సంవత్సర కాలంలో మొత్తం 604 కేసెస్ బుక్ చేశారు.


Similar News