రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...

కాజీపేట రైల్వే పీఓహెచ్ ని అప్‌గ్రేడ్ చేస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం

Update: 2025-01-08 07:13 GMT

దిశ, హనుమకొండ : కాజీపేట రైల్వే పీఓహెచ్ ని అప్‌గ్రేడ్ చేస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్భంగా బుధవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు ఆధ్వర్యంలో అయోధ్య పురం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని సందర్శించి అనంతరం మడికొండ చౌరస్తాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి ప్రజలకు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు మాజీ మేయర్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు, వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, వన్నాల శ్రీరాములు, మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ జిల్లా నాయకులు పొనుగోటి వెంకట్ రావు , ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం మహేందర్, మాజీ కార్పొరేటర్ నార్ల గిరి రామలింగం, జలగం రంజిత్, బన్న ప్రభాకర్, దేవేందర్ రెడ్డి, బండి సాంబయ్య యాదవ్, మునిగాల కరుణాకర్, తక్కల్లపల్లి నిఖిల్ రావు, పిట్టల రమేష్ గారు, దువ్వ నవీన్, బరిగెల పినకర్ బాబు, బొల్లికొండ వినోద్, దారంగుల రాజేష్, ఎలగొండ శివ, మాచర్ల రంజిత్, తదితరులు పాల్గొన్నారు.


Similar News