ఆటో ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక వ్యక్తి ఆత్మహత్య..
మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఆటో డ్రైవర్‌లకు శాపంగా మారింది. ఆటో ఫైనాన్స్‌లు కట్టలేక, ఆర్టీవో టాక్సీలు చెల్లించ లేక జీవనం భారమై భార్య పిల్లలను పోషించలేని
దిశ, ఏటూరునాగారంః- మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఆటో డ్రైవర్‌లకు శాపంగా మారింది. ఆటో ఫైనాన్స్‌లు కట్టలేక, ఆర్టీవో టాక్సీలు చెల్లించ లేక జీవనం భారమై భార్య పిల్లలను పోషించలేని స్థితిలో మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఏటూరునాగారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటంబ సభ్యుల కథనం మేరకు..ఏటూరునాగారం మండల కేంద్రంలోని బెస్తగూడెం వాడకు చెందిన బాస నాగారాజు (30) రెండు ఆటోలను ఫైనాన్స్‌లో తీసుకొని ఆటోలు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ఫ్రీ బస్సు కారణంగా ఆటో లో ప్యాసింజర్‌లు ప్రయాణించకపోవడంతో గిరాకీలు లేక కుటుంబ పోషణ, తీసుకున్న పైనాన్స్‌లు కట్టలేక, ఆర్టీవో మూడు నెలలకొకసారీ వేసే టాక్సీలు చెల్లించలేని పరిస్థితిలో జీవనం భారమై పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు బాస నాగరాజుకు భార్య నవనీత, కూతురు మధు వర్షిని, కొడుకు రణధీర్ ఉన్నాడు. స్వంత ఇళ్లు కూడా లేని నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వ ఆదుకోవాలని, అంతే కాకుండా ఫ్రీ బస్సు పథకాన్ని తొలగించి మాకు న్యాయం చేయాలని ఆటో యూనియన్ కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.