Fire Accident : మాదాపూర్లో భారీ అగ్ని ప్రమాదం
మాదాపూర్లో(Madapur) భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది.
దిశ, వెబ్ డెస్క్ : మాదాపూర్లో(Madapur) భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. మాదాపూర్లో డీ మార్ట్ కు ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ రెస్టరెంట్లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా భారీగా మంటలు ఎగసి పడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.