పవర్ ఎంప్లాయిస్‌యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ స్టేట్‌పవర్ ఎంప్లాయిస్‌యూనియన్1535 యూనియన్ 2025 సంవత్సర క్యాలెండర్‌ను ఆ సంఘ అధ్యక్షులు, ఎంఏ. వజీర్, టీజీ ట్రాన్స్‌కో కంపెనీ అధ్యక్షులు కళ్లేం శ్రీనివాస్‌రెడ్డి ల నేతృత్వంలో బుధవారం బుధవారం విద్యుత్‌సౌధలో ఆవిష్కరించుకున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్టేట్‌పవర్ ఎంప్లాయిస్‌యూనియన్1535 యూనియన్ 2025 సంవత్సర క్యాలెండర్‌ను ఆ సంఘ అధ్యక్షులు, ఎంఏ. వజీర్, టీజీ ట్రాన్స్‌కో కంపెనీ అధ్యక్షులు కళ్లేం శ్రీనివాస్‌రెడ్డి ల నేతృత్వంలో బుధవారం బుధవారం విద్యుత్‌సౌధలో ఆవిష్కరించుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 23 వేల మంది ఆర్టీజన్లుగా విలీనం అయ్యారని, ఇంకా మిగిలి పోయిన వారిని కూడా ఆర్టిజన్లుగా విలీనం చేయడం, ఇప్పటికే ఆర్టీజన్లుగా ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్‌చేశారు. ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ పెన్షన్సౌకర్యం కల్పిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి అది అమలు చేయకుండానే పోయిందన్నారు. విద్యుత్ సంస్థలు ఐడి నెంబర్కలిగి మిగిలి పోయిన కాంట్రాక్టు ఉద్యోగులను ఆర్టీజన్లుగా కన్వర్షన్ఇవ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెలంగాణ విద్యుత్‌సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగ కార్మిక సిబ్బందికి 1999 ఫిబ్రవరి 1 తర్వాత జాయిన్అయిన వారికి ఈపీఎఫ్నుండి జీపీఎఫ్పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ ప్రతినిధులు డి. రాధాకృష్ణ, పి, నాగేశ్వర రావు, పి . రాము, జి. కుమార స్వామి, కె. ప్రమోద్‌కుమార్, కె.శ్రీనివాస్, యం. శ్రీనివాస్, జీవిఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.