అదుపు తప్పి ఆటో బోల్తా...పలువురికి గాయాలు
అదుపు తప్పి ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన బుధవారం ముథోల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
దిశ,భైంసా : అదుపు తప్పి ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన బుధవారం ముథోల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...వ్యవసాయ కూలీలతో ముథోల్ నుండి అబ్దుల్లాపూర్ కు వరి నాటు వేయడానికి వెళ్తున్న ఆటో రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి బోల్తా పడింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఐదుగురికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.