ప్రజా ఆదరణ పొందిన పత్రిక దిశ..
మీడియా రంగంలో అనాది కాలంలోనే దిశ పత్రిక ప్రజా ఆదరణ పొందిందని హుజూర్ నగర్ సిఐ చరమందరాజు అన్నారు.
దిశ ,హుజూర్ నగర్ : మీడియా రంగంలో అనాది కాలంలోనే దిశ పత్రిక ప్రజా ఆదరణ పొందిందని హుజూర్ నగర్ సిఐ చరమందరాజు అన్నారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణంలోని సీఐ ఆఫీస్ లో దిశ పత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీడియా రంగంలో ఇప్పటికే దిశ పత్రిక ప్రత్యేక స్థానం పొందిందని, ఇలాగే మంచి మంచి కథనాలు ప్రచురించి వాస్తవాలు బయటికి తీయాలని సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా దిశ యజమాన్యానికి పాఠకులకు జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దిశ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ చార్జి రావుల రాజు, చింతలపాలెం మఠంపల్లి గరిడేపల్లి, రిపోర్టర్లు ఉదయ్ కుమార్, సైదా నాయక్, శివ ఉన్నారు.