1.8 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించిన WhatsApp

Update: 2022-03-02 13:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఐటి రూల్స్, 2021కి అనుగుణంగా జనవరి నెలలో ఇండియాలో 18,58,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ మంగళవారం తెలిపింది. మొత్తం జనవరి నెలలో 495 ఫిర్యాదులు అందాయని, వాటిలో 24 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నామని కంపెనీ తెలిపింది. "కొత్త మంత్లీ రిపోర్ట్‌లో జనవరి నెలలో WhatsApp 1.8 మిలియన్ ఖాతాలను నిషేధించింది" అని కంపెనీ తెలిపింది. జనవరి 1 నుండి జనవరి 31 మధ్య వాట్సాప్‌ను దుర్వినియోగం చేసిన వారి ఖాతాలను నిషేధించినట్లు, "రిపోర్ట్" ద్వారా ఫీడ్‌బ్యాక్‌‌ను పరిగణలోకి తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నిరోధించడంలో వాట్సాప్ పరిశ్రమలో అగ్రగామిగా ఉంది అని కంపెనీ ప్రతినిధి తెలిపారు. Facebook ఇంతకు ముందు 11.6 మిలియన్లకు పైగా కంటెంట్‌లను, Instagramలో 3.2 మిలియన్లకు పైగా కంటెంట్‌లను జనవరి నెలలో తీసివేసింది.

Tags:    

Similar News