AP News : స్టాక్‌మార్కెట్‌లో లాస్.. హెడ్మాస్టర్ ఆత్మహత్య
స్టాక్‌మార్కెట్(Stock Market)లో లాస్ రావడంతో అప్పులపాలైన ఓ హెడ్మాస్టర్ ఆత్మహత్య(Headmaster suicide) చేసుకున్నాడు.
దిశ, వెబ్ డెస్క్ : స్టాక్‌మార్కెట్(Stock Market)లో లాస్ రావడంతో అప్పులపాలైన ఓ హెడ్మాస్టర్ ఆత్మహత్య(Headmaster suicide) చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం అనంతపురం(Ananthapuram) జిల్లా కూడేరు మండలం కమ్మురుకు చెందిన భాస్కర్ హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తక్కువ టైమ్ లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు. బయట అందిన కాడికి అప్పులు చేసి మరీ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టగా.. అందులో భాస్కర్ భారీగా నష్టపోయాడు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.