Ys Jagan: చంద్రబాబుపై పోరుకు సిద్ధమైన జగన్.. ప్రజలకు కీలక పిలుపు

ఏపీ మాజీ సీఎం జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు....

Update: 2024-12-19 09:50 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్(Former AP CM Jagan) అనంతపురం జిల్లా(Anantapur District)లో పర్యటిస్తున్నారు. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల(Irrigation Associations Election) ఫలితాలపై వైసీపీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ సాగునీటి సంఘాల ఎన్నికల్లో.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. కూటమి నేతలు విజన్‌ 2047(Vision 2047) పేరిట డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కులేదని ఎద్దేవా చేశారు. విజన్‌ అంటే తమ ప్రభుత్వంలో తెచ్చిన సంస్కరణలని చెప్పారు. ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని జగన్ మోహన్ రెడ్డి గుర్తుచేశారు.

‘‘రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటి వద్దే ప్రజలకు సేవలందించాం. ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్థ.. ప్రతి ఎకరా ఈ-క్రాప్‌ చేయించాం. రంగురంగుల కథలకు విజన్‌ అని పేరు పెడుతున్నారు. దాన్ని విజన్‌ అనరు..420 అంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మందికి పెన్షన్లు కట్‌ చేశారు. కొత్త పింఛన్లు ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం పోరుకు సిద్ధం కావాలి.’’ అని జగన్‌ పిలుపు నిచ్చారు.

Tags:    

Similar News