లోకేశ్ నన్ను హిట్లర్ అని పిలుస్తాడు: నారా భువనేశ్వరి
లోకేశ్ తనను హిట్లర్ అని పిలుస్తారని ఆయన తల్లి నారా భువనేశ్వరి తెలిపారు..
దిశ, వెబ్ డెస్క్: లోకేశ్ తనను హిట్లర్ అని పిలుస్తారని ఆయన తల్లి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) తెలిపారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ(Kuppam Govt Degree College) విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఇంట్లో విషయాలను విద్యార్థులను అడగారు. దీనికి ఆమె నవ్వులు పూయిస్తూ సమాధానం చెప్పారు. నారా లోకేశ్(Nara Lokesh)ను తాను చాలా పద్ధతిగా పెంచానని, అందుకే తనను హిట్లర్ అని పిలిచేవాడని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తనకు అసలు టైమ్ ఇవ్వరని తెలిపారు. తాను కూడా ఆయనను డిస్టర్బ్ చేయననని చెప్పారు. ప్రతి భార్య కూడా తమ భర్తకు అండగా నిలబడాలని సూచించారు. అందరు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)ను తన తమ్ముడు అనుకుంటారని, కానీ ఆయన తన అన్న అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. తనకు నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అఖండ సినిమాలు అంటే ఇష్టమని చెప్పారు. సినిమాలు చాలా తక్కువగా చూస్తానని...డైరెక్టర్ల గురించి కూడా తనకు పెద్దగా తెలియదని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.