పెళ్లి చేసుకోను డేటింగ్ మాత్రమే.. నటికి షాకిచ్చిన అభిమాని
దిశ, సినిమా : సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్‌కు ఓ నెటిజన్ ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చాడు.
దిశ, సినిమా : సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్‌కు ఓ నెటిజన్ ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చాడు. యూనిక్ డ్రెస్సింగ్ స్టైల్‌తో అట్రాక్ట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న నటిని ప్రేమిస్తున్నానంటూ సదరు అభిమాని నెట్టింట హల్చల్ చేశాడు. అంతేకాదు లలిత్ మోడీ, సుస్మితా లవ్‌స్టోరీ చూసి ఇన్స్పైర్ అయిన తను అదే స్టైల్లో ప్రేమను వ్యక్తపరచడం విశేషం. 'కేవలం క్లారిటీ కోసం : పెళ్లి చేసుకోలేదు. మేమిద్దరం డేటింగ్ మాత్రమే చేస్తున్నాం. అది కూడా ఓ రోజు జరుగుతోంది' అంటూ ట్వీట్ చేసిన అతడు 'నా ఎస్ఎంఎస్కు రిప్లై ఇవ్వు' అంటూ ఉర్ఫీని ట్యాగ్ చేశాడు. ఈ మ్యాటర్ వైరల్ అవడంతో ఒక్కసారిగా కంగుతిన్న ఉర్ఫీ ఆ పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 'నేను దీనికి రిప్లై ఇవ్వలేను' అంటూ స్మైల్ ఎమోజీలను జత చేసింది.