21 వాహనాలకు వేలం

మేడ్చల్ ఎక్సైజ్ శాఖ అధికారులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు మంగళవారం మేడ్చల్ ఎక్సైజ్ శాఖ కార్యాలయ ఆవరణలో వేలం నిర్వహించారు.

Update: 2024-11-26 14:33 GMT

దిశ,మేడ్చల్ టౌన్ : మేడ్చల్ ఎక్సైజ్ శాఖ అధికారులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు మంగళవారం మేడ్చల్ ఎక్సైజ్ శాఖ కార్యాలయ ఆవరణలో వేలం నిర్వహించారు. మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. నవనీత తెలిపిన వివరాల ప్రకారం డిస్ట్రిప్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఫయాజుద్దీన్ ఆధ్వర్యంలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల వేలం నిర్వహించినట్లు తెలిపారు.

     21 వాహనాలకు వేలం నిర్వహించగా 16 వాహనాలకు వివిధ వ్యక్తులు వేలంపాటలో పాల్గొని కొనుగోలు చేశారు. వాహనాల వేలంలో 5 లక్షల 25 వేల 843 రూపాయలు వచ్చినట్లు ఆమె తెలిపారు. దీనికి 18% జీఎస్టీని చెల్లించినట్టు చెప్పారు. మిగిలిన వాహనాలకు నిర్ణీత సమయంలో వేలం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. 


Similar News