స్టార్ నటులు కూడా అసభ్యంగా మాట్లాడుతారు.. యంగ్ బేబి
దిశ, సినిమా: హిందీ 'బిగ్‌బాస్' ఫేమ్, సోషల్ మీడియా సంచలనం..telugu latest news
దిశ, సినిమా: హిందీ 'బిగ్‌బాస్' ఫేమ్, సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్ మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో బోల్డ్ ఫ్యాషన్ లుక్స్‌తో నెటిజన్లను ఆకర్షించే నటి.. తాజాగా టెలివిజన్ నటులపై సంచలన కామెంట్స్ చేసింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన కెరీర్, ఫ్యాషన్ గురించి మాట్లాడుతూ టీవీ పరిశ్రమలో తనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. జీవితాంతం ఎన్ని గొప్ప పనులు చేసినా.. తనను మాత్రం ఇండస్ట్రీలో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే మిగిల్చారని వాపోయింది. టీవీ షోలు, సినిమాల్లో ప్రధాన పాత్రలకు నిర్మాతలు తన పేరును ఎప్పుడూ పరిగణించలేదన్న ఆమె.. కొన్ని టెలివిజన్ షోస్‌లో భాగమైనప్పటికీ సరైన రెస్పాన్స్, రెస్పెక్ట్ దక్కలేదని చెప్పింది. ఇక తాను సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్ట్‌లపై పలువురు టెలివిజన్ నటీనటులు అసహ్యంగా, అసభ్యంగా కామెంట్ చేస్తారన్న ఉర్ఫీ.. వాళ్లకేం ద్రోహం చేశానో చెప్పాలని ప్రశ్నించింది.