మెటబాలిజం ట్రాకింగ్ రింగ్.. త్వరలోనే మార్కెట్‌లో!
దిశ, ఫీచర్స్ : ‘సూపర్ హ్యూమన్’ కంపెనీ తాజాగా అల్ట్రా హ్యూమన్(Ultrahuman) వేరబుల్ రింగ్‌ను విడుదల చేసింది..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : 'సూపర్ హ్యూమన్' కంపెనీ తాజాగా అల్ట్రా హ్యూమన్(Ultrahuman) వేరబుల్ రింగ్‌ను విడుదల చేసింది. ఇది యూజర్ల మెటబాలిజం(జీవక్రియ), నిద్ర సహా ఇతర బాడీ డైనమిక్స్‌ను రియల్ టైమ్‌లో కొలవగలదని కంపెనీ తెలిపింది. ఎటువంటి స్క్రీన్ లేని ఈ రింగ్ వైబ్రేట్ కాదని, బ్యాటరీ లైఫ్ 5 రోజుల పాటు ఉంటుందని పేర్కొంది.
వర్సవుట్స్ సమయంలో అన్‌సేఫ్ కండిషన్స్(అసురక్షిత పరిస్థితులను) తట్టుకునేలా ఈ హ్యూమన్ రింగ్ రూపొందించారు. దీని బయటి ఉపరితలాన్ని టంగ్‌స్టన్ కార్బైడ్‌తో పూసిన టైటానియంతో తయారు చేశారు. నిద్ర, విశ్రాంతి సమయంలో సౌకర్యవంతంగా ఉండేందుకు మృదువైన లోపలి షెల్ కలిగి ఉంటుంది. NEAT(నాన్-ఎక్సర్‌సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్), నిద్ర సామర్థ్యం, జీవక్రియపై వాటి ప్రభావంతో పాటు అనేక అంతర్దృష్టులను ఈ రింగ్ ట్రాక్ చేస్తుంది. జులై 7 నుంచి ప్రీ-ఆర్డర్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని ఈ కామర్స్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుందని వెల్లడించిన కంపెనీ.. ఆగస్టు 2022 నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తామని తెలిపింది. అయితే ఈ పరికరం ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
మెటబాలిక్ బయోమార్కర్స్‌తో కూడిన మా రింగ్.. మీ గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా అంతర్దృష్టులపై సమర్థవంతమైన మార్గంలో ఎలా పని చేయాలో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఉదా. నిద్ర లేకపోవడం, ఆహారం తీసుకోకపోవం అనేది మీ గ్లూకోజ్ జీవక్రియలో ఎంతవరకు ప్రభావితం చేస్తుందో గుర్తించవచ్చు. బయోమార్కర్ల ప్రపంచంలో ఇది ఒక అద్భుతమైన మేలిమలుపుగా చెప్పొచ్చు. మానవ ఆరోగ్యం చుట్టూ ఉన్న వివిధ అంశాలను గతంలో కంటే ప్రత్యేకమైన, ప్రభావవంతమైన రీతిలో అధ్యయనం చేసేందుకు ఈ రింగ్ వీలు కల్పిస్తుంది.
- మోహిత్ కుమార్, ఫౌండర్ అండ్ సీఈవో