క్షమించండి.. నేను ఏమీ చెప్పలేను:జెలెన్ స్కీ
కీవ్ : రష్యా ఆయిల్ డిపోపై ఉక్రెయిన్ దాడికి పాల్పడిందని రష్యా చేస్తున్న ఆరోపణలపై..latest telugu news
కీవ్ : రష్యా ఆయిల్ డిపోపై ఉక్రెయిన్ దాడికి పాల్పడిందని రష్యా చేస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. రష్యా ఇంధన నిల్వలపై హెలికాప్టర్ ద్వారా బాంబు దాడులు జరిగాయని రష్యా చేస్తున్న ఆరోపణలపై మాట్లాడుతూ 'నా ఆదేశాలపై నేను చర్చించను. ఈ దేశ నాయకుడిగా, కమాండర్ ఇన్ చీఫ్‌గా నా ఆదేశాలను ఏది మీతో చర్చించను.. నన్ను క్షమించండి. ఉక్రెయిన్ సైనిక సాయుధ దళాలతో నేను పంచుకునే విషయాలు మాత్రమే ఉన్నాయి. మీరు పేర్కొన్న భూభాగంలో ఉక్రెయిన్ ఆర్మీ షూటింగ్ సిస్టమ్‌లను ఉంచిందని, క్షిపణులను పేల్చింది మేమేనని మీరు అర్థం చేసుకోవాలి' అని ఆయన చెప్పారు. అయితే, ఉక్రెయిన్ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా నగరమైన బెల్గోరోడ్‌లోని ఇంధన డిపోలో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అంతకుముందు ఇంధన నిల్వ కేంద్రంపై రెండు ఉక్రెయిన్ ఎంఐ-24 హెలికాప్టర్లు దాడి చేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది. కాగా, ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది గాయపడగా ఆయిల్ నిల్వల డిపో ఘోరంగా దెబ్బతిన్నదని తెలుస్తోంది.