సమంతపై మనసు పడ్డ యంగ్ హీరో.. అప్పుడే ఫిదా అయిపోయానంటూ కీలక వ్యాఖ్యలు!

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) ఇటీవల ‘బవాల్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు.

Update: 2024-10-17 13:45 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) ఇటీవల ‘బవాల్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) ‘స్త్రీ-2’ మూవీలోనూ వరుణ్ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలైన బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. వరుణ్, సమంత(Samantha) కాంబోలో తెరకెక్కిన ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనిని ‘ఫ్యామిలీ మ్యాన్-2’ ఫేమ్ రాజ్ అండ్ డీజే రూపొందించారు. అయితే ఇది సీరిస్ భారీ అంచనాల నడుమ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వరుస అప్డేట్స్ మేకర్స్ విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ ధావన్ తాను సమంతకు ఫిదా అయినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సమంత(Samantha) లాంటి టాలెంటెడ్ యాక్టర్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. మాలాంటి హీరోలతో ధీటుగా ఆమె చేసిన ఫైట్స్ కొన్ని గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

సమంత ‘మక్కీ’ (ఈగ) సినిమా చూసినప్పుడే ఆమెకు నేను ఫిదా అయిపోయాను. మొత్తానికి అభిమానిగా మారిపోయాను ఆమె అంటే నాకు చాలా ఇష్టం. సామ్‌తో స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ వరుణ్ ధావన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News