మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరం
భారత మాజీ ప్రధాని,దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరం అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు..
దిశ , గాంధారి : భారత మాజీ ప్రధాని,దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరం అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు.. శుక్రవారం నాడు గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాజీ ప్రధాని డా:మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలతో కలిసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతుూ.. 2నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగ ఎమ్మెల్యే మాట్లాడుతూ ..దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత మన్మోహన్ సింగ్ అని అన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులు అని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ ఛైర్మన్ గా విశిష్ట సేవలందించి ఆయన ఆర్థిక మంత్రిగా కూడా సేవలు అందించారన్నారు. ఆయన హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కిందని ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలక పాత్ర పోషించి, మన రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేశారని , విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి కీలక నిర్ణయాలు ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలోనే అమల్లోకి వచ్చాయని తెలిపారు. నేడు భౌతికంగా మన్మోహన్ సింగ్ మనకి దూరమైన, ఆయన ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలందరం పునరంకితమవుతాం అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ పరమేశ్, మండల సీనియర్ నాయకుడు తూర్పు రాజులు, మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, మాజీ ఎంపీటీసీ బాలరాజు,యూత్ నాయకుడు సర్దార్, పట్టణ అధ్యక్షుడు సంగని బాబా,నీల రవి, ఎఎంసి వైస్ చైర్మన్ లక్ష్మణ్, మహిళా నాయకురాలు వసుందర, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.