వరద కాలువలో పడి వ్యక్తి మృతి

మండల కేంద్రానికి చెందిన దొండి గంగ మోహన్ (45) అనే పూల వ్యాపారి శుక్రవారం సాయంత్రం వరద కాలువలో శవమై తెలినట్లు కమ్మర్ పల్లి ఎస్సై జి.అనిల్ రెడ్డి తెలిపారు.

Update: 2024-12-27 15:43 GMT

దిశ, కమ్మర్ పల్లి: మండల కేంద్రానికి చెందిన దొండి గంగ మోహన్ (45) అనే పూల వ్యాపారి శుక్రవారం సాయంత్రం వరద కాలువలో శవమై తెలినట్లు కమ్మర్ పల్లి ఎస్సై జి.అనిల్ రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..దొండి గంగా మోహన్ బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదని భార్య దొండి గంగమణి ఫిర్యాదు చేయగా..మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కమ్మర్ పల్లి నుండి ఉప్లూర్ కు వెళ్లే రోడ్డు మార్గమధ్యలో వరద కెనాల్ లో శవం ఉందని తెలియడంతో.. ఆ శవం గంగా మోహన్ శవంగా గుర్తించడం జరిగింది అని తెలిపారు. గంగా మోహన్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.


Similar News