ఆర్మూర్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు
ఆర్మూర్ ఆర్టిసీ డిపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షణకు ప్రత్యేక బస్సు సర్వీసు అందుబాటులో ఉంచినట్లు డిఎం రవికుమార్ తెలిపారు
దిశ ,ఆలూర్ : ఆర్మూర్ ఆర్టిసీ డిపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షణకు ప్రత్యేక బస్సు సర్వీసు అందుబాటులో ఉంచినట్లు డిఎం రవికుమార్ తెలిపారు. జనవరి 4న మధ్యాహ్నం 3 గంటలకు సూపర్ లగ్జరీ, బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు. యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు.ఈ యాత్ర ఆర్మూర్ నుంచి అరుణాచలంకు, కాణిపాకం, వెళ్లూరు గోల్డెన్ టెంపుల్, అలంపూర్ జోగులాంబ మీదుగా తిరిగి ఆర్మూర్ కు వస్తుందన్నారు. ఈ టూర్ కు ప్రతి ఒక్కరికి చార్జీలు ఇలా ఉన్నాయని వివరించారు. పెద్దలకు 4200/రూపాయలు, పిల్లలకు 3400 టికెట్ రుసుము ఉంటుందని తెలియజేశారు. వివరాలకు 9948775487 సంప్రదించాలని కోరారు.