ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

ఆర్మూర్ మండలం మిర్జాపల్లి గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడి కార్మికుడు లక్ష్మయ్య మృతి చెందాడు.

Update: 2024-12-27 15:08 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్  మండలం మిర్జాపల్లి గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తా పడి కార్మికుడు లక్ష్మయ్య మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇస్సపల్లి గ్రామం నుంచి మిర్దాపల్లికి ట్రాక్టర్ లో ఇటుకలను ఎక్కించుకొని ట్రాక్టర్ డ్రైవర్ సుదర్శన్ నిర్లక్ష్యంగా నడుపుతూ వెళ్తుండగా..ట్రాక్టర్ మలుపు తీసుకునే క్రమంలో బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో కార్మికుడు లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఆర్మూర్ ఎస్సై మహేష్ పరిశీలించి, మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. 


Similar News