విద్యుత్ ఘాతంతో గిరిజన మహిళ మృతి..
విద్యుత్ ఘాతానికి గురై మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం
దిశ, కొల్చారం : విద్యుత్ ఘాతానికి గురై మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం కొల్చారం మండలం సంగాయిపేట తండాలో జరిగింది. కొల్చారం మిస్సయి మహమ్మద్ గౌస్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తండా కు చెందిన గుగులోతు బూలి (28) శుక్రవారం ఉదయం ఇంట్లో నీళ్ల హీటర్ కి ప్రమాదవశాత్తు చేయి తగలడంతో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతురాలి భర్త శివ ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్సై కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.