Narcotics Gang : అక్రమంగా సిరప్‌లు, ట్యాబ్లెట్ల తయారీ.. 4 రాష్ట్రాల్లో సప్లై.. ముఠా గుట్టురట్టు
దిశ, నేషనల్ బ్యూరో : ఔషధాలను అక్రమంగా తయారు చేసి, డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డ్రగ్స్ ముఠా(Narcotics Gang)ను ఢిల్లీ పోలీసులు(Delhi Police) ఛేదించారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఔషధాలను అక్రమంగా తయారు చేసి, డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డ్రగ్స్ ముఠా(Narcotics Gang)ను ఢిల్లీ పోలీసులు(Delhi Police) ఛేదించారు. ఈ ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.1 కోటి విలువైన ఆల్ప్రా జోలం ట్యాబ్లెట్లు, కోడీన్ ఫాస్పేట్ సిరప్, ట్రమడాల్, ట్రై ప్రొలిడైన్ హైడ్రో క్లోరైడ్ (యాంటీ హిస్టామైన్)లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని బవానా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ముఠా అక్రమంగా నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలో అక్రమ ఔషధాలు దొరికాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
సమాలుద్దీన్ సాదిఖ్ (28), మహ్మద్ గుల్జార్ (34), సల్మాన్ ఇక్బాల్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ముఠా ఆధ్వర్యంలో తయారు చేసిన ఔషధాలను యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్‌గా, చౌకైన మత్తుమందులుగా, యాంటీ హిస్టామైన్లుగా విక్రయించినట్లు గుర్తించారు. కోజెక్స్, క్యూరెక్స్-టీ వంటి లేబుల్స్‌తో ఆయా అక్రమ ఔషధాలను విక్రయించేవారు. ఢిల్లీ, హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్‌లలో ఈ మందులు విక్రయించేవారని సమాచారం.