Funeral: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు ప్రారంభం.. ప్రముఖుల నివాళి
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Former Prime Minister Manmohan Singh) అంతిమ సంస్కారాలు ప్రభుత్వం అధికారక లాంఛనాలతో ఢిల్లీ (Delhi)లోని నిగమ్‌బోధ్ (Nigambodh)లో ప్రారంభం అయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Former Prime Minister Manmohan Singh) అంతిమ సంస్కారాలు ప్రభుత్వం అధికారక లాంఛనాలతో ఢిల్లీ (Delhi)లోని నిగమ్‌బోధ్ (Nigambodh)లో ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi), ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ (Vice President Jagadeep Dhankad), కేంద్ర మంత్రులు అమిత్ షా (Amit Shah), రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh), జేపీ నడ్డా (JP Nadda), భూటాన్ రాజు జిగ్మే వాంగ్‌చుక్, త్రివిధ దళాధిపతులు హాజరై భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi), కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddharamaiah), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు మన్మోహన్ సింగ్ పార్థీవ దేహం ఎదుట పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. చివరిలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అంతిమ సంస్కారాలకు హాజరై మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. కాగా, అంతుకు ముందు ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయం (AICC headquarters) నుంచి అంతిమయాత్ర ప్రారంభం అయి నిగమ్‌బోధ్ ఘాట్ వరకు కొనసాగనుంది.